జీహెచ్ఎంసీ పరిధీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖు స్థాపన చేశారు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు అందచేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ఇళ్ళు లేని పేదలు చాలా మంది ఉన్నారని, సీఎం కేసీఆర్ ఇల్లు లేని పేదలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమంను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కోరుతున్నామని అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి కి కేంద్రం అండగా ఉంటుందని అన్నారు. ఇక కేటీఆర్ మాట్లాడుతూ పండుగ వాతావరణంలో లంబడి తండాలో డబుల్ బెడ్ లు అడబిడ్డలకు అందివ్వడం సంతోషంగా ఉందని అన్నారు. అంతే కాక ఆయన ఎన్నికల అప్పడు పోటీ పడదాం… ఎవరి వాదనలు వారు గట్టిగా చెప్పుకుందామని బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు. టిఆర్ఎస్ ,బీజేపీ నేతలకు వినతి… ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం కలసి పనిచేద్దామని హుందాగా రాజకీయాలు చేద్దామని చెప్పుకొచ్చారు.