మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు ఇవ్వడంపై..రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు ఇస్తారు.
ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె రూ. 77, 220 చెల్లించనుంది ఆర్టీసీ. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది ప్రభుత్వం. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడువనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.