ఆ ఎంపీపై కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం… అవ‌మానించినందుకేనా..!

-

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీకి చెందిన యువ ఎంపీ వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారా ? సదరు ఎంపీ చేసిన పనికి టిఆర్ఎస్ పార్టీకి జాతీయ స్థాయిలో డ్యామేజ్ జరిగిందా ? అందుకే కేటీఆర్ ఆ ఎంపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారా ? అంటే అవుననే ఆన్సర్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఓ నేష‌న‌ల్ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్న రంజిత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోవడంతో… కెసిఆర్ ఇమేజ్ జాతీయ స్థాయిలో డ్యామేజ్ అయ్యింద‌న్న వార్త సోష‌ల్ మీడియాలో అవుతోంది. ఇప్పుడు ఇదే కేటీఆర్ ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది.

తాజాగా ఎంపీ రంజిత్ రెడ్డి .. ఒక నేషనల్ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్నారు. ఆ డిబేట్‌లో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన దిశ ఉదంతం గురించి యాంక‌ర్ ఓ ప్ర‌శ్న వేసింది. అంత సంఘ‌ట‌న జ‌రిగితే మీ నాయ‌కుడు ఆమె త‌ల్లి దండ్రుల‌ను ఎందుకు ప‌రామ‌ర్శించ లేదు ? క‌నీసం ఫోన్లో అయినా ధైర్యం చెప్ప‌లేదు క‌దా ? ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అన్న ప్ర‌శ్న వేసింది. ఇందుకు రంజిత్ రెడ్డి కౌంట‌ర్ ఆన్స‌ర్ ఇవ్వ‌కుండా మౌనంగా ఉండిపోయారు.

ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. రంజిత్‌రెడ్డి కేసీఆర్ ప‌రువు తీశారంటూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు కేసీఆర్ త‌ప్పును ఆయ‌న ఒప్పుకున్నార‌ని కామెంట్లు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే కేటీఆర్ రంజిత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. తాము డిబేట్ల‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని చెప్పినా నువ్వు ఎందుకు వెళ్లావ్ ? అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ట‌. డిబేట్ల‌లో మాట్లాడే స‌మ‌ర్థ‌త లేనప్పుడు వెళ్లి పార్టీ ప‌రువు తీయ‌కూడ‌దు క‌దా ? అని మ‌రికొంద‌రు రంజిత్‌రెడ్డికి సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version