టీం ఇండియాలో ఇప్పుడు గంగూలీ హవా మళ్ళీ నడుస్తుందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. టీం ఇండియాలో కోహ్లి పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో చాలా మార్పులు వచ్చాయి. గతంలో ఎన్నడు లేని విధంగా జట్టు మీద బయటి వారి ప్రభావం ఎక్కువైంది అనేది వాస్తవం. నాలుగేళ్ల క్రితం టీం ఇండియాలో మేనేజర్ గా బాధ్యతలు చేపట్టిన రవి శాస్త్రి జట్టులో ఆటగాళ్ళకు సలహాలు ఇవ్వడం హెడ్ కోచ్ తరహాలో వ్యవహరించడం, తుది జట్టులో పలానా వాళ్ళే ఉండాలి అంటూ ప్రవర్తించడం,
అప్పుడే టీం ఇండియాలో కీలకంగా మారుతున్న విరాట్ కోహ్లితో సన్నిహితంగా మెలగడం, ఇక కోచ్ అయిన తర్వాత… జట్టు సెలెక్షన్ మీద కూడా ప్రభావితం చేయడం వంటివి చేసాడు. ఇదే క్రమంలో కోహ్లితో సన్నిహితంగా ఉంటూ తన మాట వినని వాళ్ళ మీద పెత్తనం చెలాయించడం వంటివి రవి శాస్త్రి చేసాడు. ప్రపంచ కప్ లో టీం ఓడిపోవడానికి కారణం కూడా కోచ్ గా ఉన్న శాస్త్రే కారణమనే వ్యాఖ్యలు వినపించాయి. ఇప్పుడు అతన్ని ప్రభావాన్ని గంగులీ తగ్గించాడని అంటున్నారు. టీం లో రవి శాస్త్రి పెత్తనం లేకుండా, జట్టు ఎంపికలో,
అతను సెలెక్షన్ కమిటి మీటింగ్ లో కూర్చోకుండా గంగులీ చేసాడని సమాచారం. ఆటగాళ్ళ ఎంపిక విషయంలో పూర్తి స్థాయి స్వేచ్చ సెలెక్షన్ కమిటికి ఇచ్చాడని, కోచ్ సలహాలు మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక కొంత కాలంగా జట్టులో రోహిత్ శర్మకు ఇతర ఆటగాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీనిపై గంగులీ అసహనం వ్యక్తం చేసాడు. అతను సీనియర్, స్టార్ ఆటగాడని కాబట్టి అతని ప్రాధాన్యత విషయంలో ఏ ఒక్క ఆటగాడు నిర్లక్ష్యంగా వ్యవహరించినా అతను సలహాలు ఇస్తున్నప్పుడు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినా చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం… ప్రధానంగా కోహ్లి వైఖరి రోహిత్ శర్మ విషయంలో మారాలని చెప్పాడట. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాడు రిషబ్ పంత్ కి మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిందేనని గంగులీ టీం మేనేజ్మెంట్ కి స్పష్టం చేసినట్టు సమాచారం.