కేటీఆర్ బంపర్ ఆఫర్.. అసలు మాత్ర‌మే చెల్లించండి..!

-

జలమండలి బిల్లు బకాయిదారులకు సువర్ణావకాశం కల్పించామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లుల​​ బకాయిలపై వడ్డీ మాఫీ చేశామని, కేవలం అసలు మాత్రమే చెల్లించాలని కేటీఆర్‌ తెలిపారు. ఈ అవకాశం ఈ నెల ఒకటి నుంచి సెప్టెంబర్ 15 వరకు అంటే 45 రోజుల పాటు అమలులో ఉంటుందన్నారు. జలమండలికి బిల్లులు క్రమంగా చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.

అలాగే జలమండలి సిబ్బంది ప్రతి ఒక్కరు కష్టపడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను వసూలు చేసి బోర్డు ఆదాయం పెంచాలని కేటీఆర్ సూచించారు. ఇందుకుగాను ప్రగతి భవన్ లో జలమండలి వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పథకం కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్, కాగా, ఇప్పటికే వన్ టైం సెటిల్‌మెంట్ పథకానికి సంబందించిన జీవో ను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రటరీ గత నెల జారీచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version