ఈడీ నోటీసులు ఇచ్చిన తరుణంలో… కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. కేటీఆర్ విజ్ఞప్తికి ఆమోదం తెలిపింది ఈడీ. హైకోర్టు తీర్పు ఉన్నందున మంగళవారమే విచారణకు రాలేనని కేటీఆర్ వివరణ ఇచ్చారు. కోర్టు తీర్పు వెలువరించే వరకు సమయం ఇవ్వాలని ఈడీకి వివరించారు కేటీఆర్.
అయితే… కేటీఆర్ వినతికి ఓకే చెప్పింది ఈడీ. విచారణకు త్వరలో మరో తేదీ ప్రకటిస్తామన్న ఈడీ ప్రకటన చేసింది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి యాంటీ కరప్షన్ బ్యూరో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈనెల 9వ తేదీన మరోసారి రావాలని కేటీఆర్ కు నోటీసులు ఇష్యూ చేసింది ఏసీబీ. ఈ మేరకు నోటీసుల్లో.. స్పష్టంగా పేర్కొంది. ఈసారి ఇచ్చిన నోటీసులలో.. లీగల్ టీంకు అనుమతి లేదని… కేటీఆర్ సింగిల్ గా రావాలని పేర్కొంది ఏసీబీ. దీంతో కేటీఆర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మరి ఈ నోటీసులపై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.