కవితని జైలుకు పంపించే విషయంలో కేటీఆర్ హస్తం ఉంది – ఎంపీ అరవింద్

-

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు బయటకు రావడం, కవితను జైలుకు పంపించే విషయంలో ఆమె సోదరుడు మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. కెసిఆర్ కూతురు లిక్కర్ స్కాంలో రేపో, మాపో జైలుకు వెళుతుందని, ఫినిక్స్ తదితర సంస్థలపై జరిగిన ఐటీ దాడుల్లో దొరికిన ఆధారాల మేరకు కేటీఆర్ కూడా జైలుకు వెళతాడని అన్నారు.

ఈ సంస్థలలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపించారు ఎంపీ అరవింద్. నాలుగైదు రోజులలో కవితకు నోటీసులు వస్తాయని, ఎంక్వయిరీ అనంతరం ఈడీ అధికారులు అటు నుంచి ఆటే ఆమెను తీసుకెళ్తారని చెప్పారు. ప్రాజెక్టులు ఇవ్వడం, వాటికి కమిషన్లు తీసుకోవడం సీఎం కేసీఆర్ కు అలవాటైపోయిందని అన్నారు.

8 ఏళ్లుగా ఆయన పని ఇదేనని మండిపడ్డారు. ఇదిలా ఉంటే బిజెపి నేతలు జోకర్లు అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ పై ఆయన ఫైర్ అయ్యారు. పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకు తమను జోకర్ అంటే ఊరుకోమని, కేటీఆర్ ను ఫుట్ బాల్ ఆడుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version