హైదరాబాద్‌లో అమెరికా కంపెనీ…ఈ రంగం వారికి ఉపాధి అవకాశాలు

-

హైదరాబాద్‌లో విదేశీ పరిశ్రమల పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. అటు ఐటీ, ఇటు ఫార్మా రంగంతో పాటు ఇతర పరిశ్రమలు కూడా హైదరాబాద్‌ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇక తాజాగా అమెరికాకు చెందిన మరో కంపెనీ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. వైద్య ప‌రిక‌రాల త‌యారీ సంస్థ అయిన మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ & ఇన్నోవేషన్ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు.

గచ్చిబౌలి సమీపంలోని నానక్‌రామ్‌గూడ బీఎస్ఆర్ టెక్ పార్కులో మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ & ఇన్నోవేషన్ కేంద్రాన్ని కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు.అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్‌ట్రానిక్‌ పనిచేస్తున్నది. మొత్తం రూ. 1200 కోట్ల‌తో ఆ సంస్థ హైదరాబాద్‌ నగరంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రపంచస్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగ్‌, ఆవిష్కరణలు చేయనుంది. దీని ద్వారా హెల్త్‌కేర్‌ రంగంలో ఇంజినీరింగ్‌ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నది. నగరంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం ద్వారా ప్రారంభంలో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించ‌నున్నాయి. మెడ్‌ట్రానిక్‌ సంస్థ అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే తన అతిపెద్ద పరిశోధన & అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version