మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న వకీల్ సాబ్ సినిమా నుండి లేటెస్ట్ గా మరో సూపర్ సాంగ్ రిలీజైంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అవగా లేటెస్ట్ గా కదులు కదులు కదులు అంటూ వచ్చిన ఈ సాంగ్ కూడా అదిరిపోయింది. మహిళా శక్తిని చాటేలా తనకు తాను ఓ సైన్యంగా మారేలా స్పూర్తిదాయకంగా ఈ పాట ఉంది. ఈ పాటని సుద్ధల అశోక్ తేజ రచించగా శ్రీ కృష్ణ, హేమ చంద్ర ఆలపించారు.
ఇప్పటికే సినిమాలో మగువ మగువా సాంగ్ సెన్సేషనల్ కాగా లేటెస్ట్ గా వచ్చిన కదులు కదులు సాంగ్ కూడా సూపర్ అనిపించుకుంది. ఈ సాంగ్ వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయంటే నమ్మల్సిందే. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మొదటి సినిమా కోసం థమన్ అదిరిపోయేలా అవుట్ పుట్ ఇచ్చాడు. సినిమా సాంగ్స్ మాత్రమే కాదు వకీల్ సాబ్ లో థమన్ బ్యాక్ గ్రౌండ్ కూడా సూపర్ అనిపించుకుంటుందని అంటున్నారు. వేణు శ్రీరాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శృతి హాసన్, నివేదా థామస్, అనన్యా నటించారు.