హైటెక్ సిటీ రైల్వే అండర్ పాస్ ప్రారంభించిన కేటీఆర్.. సర్వత్రా విమర్శలు !

-

హైటెక్ సిటీ రైల్వే అండర్ పాస్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 66.59 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం పూర్తయింది. హైటెక్ సిటీ, ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. అయితే  ఈ రైల్వే అండర్ బ్రిడ్జి ఓపెనింగ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ఎక్కడా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అమలు కాలేదు. ఇలా అయితే కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఈ కార్యక్రమం మీద విమర్శలు వస్తున్నాయి. ఇక అనంతరం కేటీఅర్ మాట్లాడుతూ విలీనమైన నగర శివారు మున్సిపాలిటీల్లో రూ.3500 కోట్ల వ్యయంతో సమగ్ర డ్రైనేజి పునర్నిర్మాణ పనులు చేపడతామని పేర్కొన్నారు.

గత టర్మ్ లో రూ.3000 కోట్లతో తాగు నీరందించే పనులను విజయవంతంగా చేపట్టామన్న ఆయన కైతలాపూర్ లో డంపింగ్ యార్డ్ సమస్య ఉందని, ఇక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆధునీకరణ ట్రాన్స్ ఫర్ పాయింట్ ను ఆధునీకరిస్తామని అన్నారు. వర్షా కాలంలో ఇండ్లలోకి నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. శివారు ప్రాంతాలకు నీటిని ఇస్తున్నాము,  డ్రైనేజి సిస్టమ్ ను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాము. దీంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. మిగతా పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్న ఆయన కరోనా పూర్తిగా పోలేదు, మరోసారి లాక్ డౌన్ రావద్దంటే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అన్నారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version