రేవంత్ ప్రభుత్వానికి కేటీఆరే యాక్టివ్ ముఖ్యమంత్రి : బండి సంజయ్ సెటైర్

-

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, బీఆర్ఎస్ పార్టీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్‌ యాక్టివ్ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. ఇరు పార్టీలు రోజుకో అంశాన్ని ప్రస్తావించి మళ్లీ దాని ఊసెత్తడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంప్రమైజ్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో త్వరగా ఎదుగుతున్న కాషాయ పార్టీపై కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని.. ఆ పార్టీ నేతల మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. సీఎం రేవంత్, కేటీఆర్ చెరో టాపిక్ ఎంచుకుని రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు
అటకెక్కాయని బండి సంజయ్ దుయ్యబట్టారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version