హైదరాబాద్ మహానగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. కళ్లుమూసి తెరిచిలోగా నగలు, డబ్బుల బ్యాగుతో ఉడాయిస్తున్నారు. ఇటీవలి కాలంలో చోరీ కేసులు పెరిగినట్లు నగర పోలీసులు సైతం వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బంగారం చోరీకి గురైంది. ఏపీలోని మండపేట నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ మహిళ బ్యాగులో నుంచి రూ.15 లక్షల విలువైన బంగారాన్ని గుర్తుతెలియని దుండగలు దొంగిలించారు.
సూర్యాపేట జిల్లాలోని నార్కట్‌పల్లి వద్ద బాధితురాలు ఈ విషయాన్ని గుర్తించి వెంటనే బస్సు డ్రైవర్‌కు సమాచారం అందించారు. దీంతో డ్రైవర్ హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుస్టేషన్‌కు బస్సును తీసుకెళ్లారు. చోరీ గురించి తోటి ప్యాసింజర్స్‌ను పోలీసులు విచారించారు.అనంతరం అదే బస్సులో వారిని హైదరాబాద్‌కు పంపారు.బాధితురాలితో కలిసి పోలీసులు బస్సు ఆపిన ప్రాంతాలకు వెళ్లి దర్యాప్తు చేశారు.