బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీ లాబీలో మంత్రి సీతక్క మాట్లాడుతూ..‘ఢిల్లీకి మూటలు మోసే బడ్జెట్’ అని కేటీఆర్ చేసిన కామెంట్లపై ఆమె ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలు ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతున్నాయని చెప్పారు.
పక్క రాష్ట్రాలకు మూటలు మోసిందే కేటీఆర్ అని, కేసీఆర్ మూటలు తీసుకున్న వారంతా ఆగం అయ్యారని ఆరోపించారు. అప్పుల గురించి కేటీఆర్ మాట్లాడటం మిలినీయం జోక్ అన్నారు. మోయలేనంత అప్పుల భారాన్ని రాష్ట్రంపై మోపిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని విమర్శించారు. బీఆర్ఎస్ బడ్జెట్ అంతా కోతల బడ్జెట్.. అందుకే ప్రజలు వాతలు పెట్టారనని గుర్తుచేశారు. మహిళా, రైతు, యువత, అట్టడుగు వర్గాల సంక్షేమ బడ్జెట్ ఇది అని సీతక్క తెలిపారు.