2025 – 2026 సంవత్సర బడ్జెట్ పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న అన్నారు. ప్రతి రంగానికి ప్రతి వర్గానికి వెన్నుపోటు అన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్.. ఇది 40% కమిషన్ల కాంగ్రెస్ బడ్జెట్ అన్నారు.
ఇచ్చిన మాటకు కాకుండా.. ఢిల్లీకి మూటలు పంపడం పైననే దృష్టి పెట్టింది. ప్రజల కష్టాలు పైన ధ్యాస లేని బడ్జెట్ అని.. ప్రజాధనాన్ని పార్టీ పంచిపెట్టే కుట్ర జరుగుతోందన్నారు. ఆటో డ్రైవర్ నుంచి మొదలుకొని అన్నదాత దాకా అందరికీ మోసమే. ఇది ట్రిలియన్ డాలర్ల అప్పు దిశగా ఉన్న బడ్జెట్.. ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని తెలిపారు. పరిపాలనకు చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్..చేనేతకు మా హయంలో 1200 కోట్ల రూపాయిలు కేటాయిస్తే. ఇవ్వాల చేనేత కార్మికులకు 300 కోట్లు కేటాయిస్తూ పరిమితం చేశారని చెప్పారు.