జన్వాడలోని ఫాంహౌస్ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయన మల్కాజిగిరి ఎంపీగా ఉన్నటైంలో నార్సింగి పీఎస్‌లో 2020లో ఆయన మీద నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఉండే జన్వాడ ఫాంహౌస్ మీద అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని రేవంత్ మీద కేసు నమోదైంది.
ఈ కేసులో రేవంత్ రెడ్డి 18 రోజులు జైలు జీవితం గడిపారు. కాగా, తనపై తప్పుడు కేసు పెట్టారని ఈ ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని 2020 మార్చిలోనే రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు.జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమి కాదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు.ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు నార్సింగి పీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.