కేసీఆర్ కూటమికి వైసీపీ మద్దతు…

-

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లోటస్ పాండ్ లో కొద్ది సేపటి క్రితమే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రాలను కేంద్రం అన్యాయం చేస్తోంది. నాన్ కాంగ్రెస్ – నాన్ భాజపా దిశగా కేసీఆర్ వేస్తున్న  అడుగులు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా ఉన్నాయి. ఇందుకుగాను ఈ రోజు కేటీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ ఆవశ్యకతను వివరించారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వివరించారు. తెలుగు రాష్ట్రాల హక్కులను సాధించుకోవాలంటే ఎంపీల సంఖ్యా బలం పెరగాల్సిన అవసరం ఎంతైన ఉంది. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా సాధనకై కేసీఆర్ ఫ్రెంట్ కి మద్దతు ప్రకటిస్తున్నా అన్నారు… కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఫ్రెంట్ గురించి జగన్ తో చర్చించినట్లు కేటీఆర్ వివరించారు. త్వరలోనే తెరాస అధినేత జగన్ ని కలుస్తారంటూ తెలిపారు. ఏపీ కి ప్రత్యేక హోదా అంశాన్ని తెదేపా నీరుగార్చిందంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version