తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ ముగ్గురు ఎమ్మెల్సీలపై బుధవారం అనర్హత వేటు వేశారు. తెరాస నుంచి శాసనమండలికి ఎన్నికైన భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవరెడ్డి లు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ..ఇటీవలే ఆ పార్టీ నేతలు మండలి ఛైర్మన్ స్వామి గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఫిర్యాదుతో పాటు కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు. దీంతో వాటిని పరిశీలించిన మండలి ఛైర్మన్ ఈ రోజు వారి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు.
ఆ ముగ్గురు నుంచి పూర్తి స్థాయి విన్న తర్వాత వారిపై అనర్హత వేటు వేస్తూ మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెరాస పార్టీ నియమావళిని ఎవరైన అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ..పార్టీ అధినేత చెప్పకనే చెప్పారు.