‘సైరా’లో విజయ్ సేతుపతి లుక్.. మోషన్ పోస్టర్ విడుదల

-

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా చేస్తున్న సైరానర సింహా రెడ్డి సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చిరుతో పాటుగా అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి స్టాస్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ సేతుపతి కూడా సైరాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ రాజా పాండి పాత్రలో కనిపిస్తున్నాడు. శివభక్తుడైన ఓబయ్య చేతిలో మొండికత్తితో ఉన్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఈరోజు విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా సైరా టీం ఈ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రాజా పాండి లుక్ లో విజయ్ అదరగొట్టాడని చెప్పొచ్చు. మరి ఈ రాజా పాండి సైరాలో చేసే హంగామా ఏంటన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం. ఈమధ్యనే సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా వచ్చిన పేట సినిమాలో విలన్ గా నటించాడు విజయ్ సేతుపతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version