జూలై, ఆగస్టు నెలల్లో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు

-

జూలై, ఆగస్టు నెలల్లో ఊరురూ తిరిగి, ప్రతి కాలనీ తిరిగి అక్కడికక్కడే పెన్షన్లిస్తాం.. కొత్త రేషన్ కార్డులిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. నాగర్ కర్నూల్ కొల్లాపూర్ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కొల్లాపూర్ లో 177 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకున్నామని పేర్కొన్నారు. తాగునీటి కష్టాలతో ఎండాకాలంలో ఊళ్లలో ఉండేందుకు జనం భయపడేదని.. 65 ఏళ్లలో కాని కరెంటు, మంచి నీటి సమస్య కేసీఆర్ సర్కారు ద్వారా పరిష్కారం అయ్యాయని స్పష్టం చేశారు.

36 -56 శాతానికి ప్రభుత్వాసుపత్రిలో కాన్పుల సంఖ్య పెరిగిందని.. వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద దేశంలో ఎక్కడ లేని విధంగా 63 లక్షల మంది రైతులకు 50 వేల కోట్లు రైతు బంధు అందించామన్నారు. గోపాల్ దిన్నె ద్వారా 25 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని.. సోమశిల సిదేదశ్వరం వంతెనతో
ఆంధ్రాకు హైదరాబాద్ కు జంక్షన్ లా కొల్లాపూర్ మారనుందని చెప్పారు. కౌన్ పూచ్ తా హై కొల్లాపూర్ ఒకప్పటి నానుడి … ఇపుడు కహహై కొల్లాపూర్ అని అడిగే పరిస్థితి ఉందన్నారు. అమరగిరిని ఏకో టూరిజం కింద అభివృద్ది చేస్తామని.. ఆహార శుద్ది పరిశ్రమలు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version