లగడపాటి రాజగోపాల్ సర్వేపై మంత్రి కేటీఆర్ తన దైన శైలిలో స్పందించారు. లగడపాటి చెప్పింది సర్వే ఫలితాలు కాదని చిలక జోస్యం అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితోనే లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాన్ని మార్చారని కేటీఆర్ ఆరోపించారు. తెరాస పార్టీకి 65–70 సీట్లు వస్తాయంటూ గత నెల 20న లగడపాటి తనకు పంపిన మెసేజ్‌ను ఆయన మంగళవారం ట్విట్టర్‌లో బయటపెట్టారు. అయితే నవంబర్ 20 నాటికి ఉన్న పరిస్థితిని బట్టి ఆ ఫలితాలు చెప్పానని, కేసీఆర్ వ్యూహాలపై తనకు పూర్తి అవగాహన ఉందని వివరించిన లగడపాటి.. నేడు కొంత మంది నాయకుల ఒత్తిడికి లొంగి సర్వే ద్వారా ప్రజలను ప్రభావితం చేసేలా ఇచ్చారని పేర్కొన్నారు.
లగడపాటి, చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులని చెప్పారు. డిసెంబర్ 11న తట్టాబుట్టా సర్దేస్తారని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. ఎంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసిన తెరాస ప్రభంజనాన్ని ఆపలేరన్నారు.
The reason I dismiss Rajgopal’s survey as concocted; ?his message to me on 20th Nov that TRS is winning 65-70 seats
It’s the same survey he shared today under pressure from CBN with cooked up numbers
P.s: I had no choice but to share this conversation to break the conspiracy pic.twitter.com/vUJ77KpmFc
— KTR (@KTRTRS) December 4, 2018