కొట్లాట మాకు కొత్త కాదు: KTR

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. మాకు కొట్లాట కొత్త కాదు. గతం లో ఇదే రోడ్డు మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా టీఆర్ఎస్ పార్టీకి ఉందని కేటీఆర్ పోస్ట్ చేశారు.

జై తెలంగాణ అని కూడా ట్వీట్ చేశారు. అయితే నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళేందుకు యత్నించగా పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు దీంతో కేటీఆర్ హరీష్ రావు అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించారు. అయితే నిన్నటి బైఠాయించిన ఫోటోలతో పాటుగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఫోటోలు అన్నీ కూడా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version