టీఆర్‌ఎస్ నేతలకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. ఇవాళ పార్టీతో నేతలతో కీలక సమావేశం నిర్వహించన ఆయన… పార్టీ లో పని చేసిన వారు ఇంకా పదవులు రాక నిరాశ తో వున్నారని.. త్వరలోనే 4, 5 వందల నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. Ghmc ఎన్నికల సందర్భంగా కొందరికి కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చాము..దాని కూడా అమలు చేసే బాధ్యత తనదేనన్నారు.
పార్టీ లో వచ్చే పదవికి కూడా ప్రజల్లో గౌరవం వుంటుందని… గ్రేటర్ లో సెప్టెంబర్ 20 లోపు పార్టీ బస్తీ, కాలనీ కమిటీలు వేసుకోవాలని తెలిపారు. జిహెచ్ఎంసి 150 డివిజన్ లకు పార్టీ కమిటీలు వేసుకోవాలని వెల్లడించారు. జిహెచ్ఎంసికి ఒక్కటే కమిటీ ఉండాలా లేక జిల్లాల కమిటీలు ఉండాలా అనేది పార్టీలో నిర్ణయం తీసుకుందామన్నారు. 2021లో టిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందరి… టి బిజెపి, టి కాంగ్రెస్ పదవులు కేసీఆర్ బిక్ష కాదా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ కాలి గోటికి సరిపోని నాయకులు ఆయన మీద మాట్లాడుతున్నారని మండిపడ్డారు.