బ్రేకింగ్ : వేములవాడలో మళ్లీ కూలిన వంతెన

-

రాజన్న సిరిసిల్లా జిల్లాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఇళ్లల్లోకి వర్పపు నీరు వచ్చింది. అయితే.. ఈ నేపథ్యం లోనే వేముల వాలో మూల వాగు పై నిర్మాణం పై ఉన్న వంతెన మళ్లీ కుప్ప కూలింది. గతం లో ఓ సారి వరద దాటికి కొట్టుకు పోయినా.. తాజాగా నిర్మాణ పనులు చేపట్టారు.

అయితే… తాజాగా కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన మరోసారి కూలిపోయింది. అయితే.. ఈ ఘటన పై స్థానికులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. కమిషన్ల కక్కుర్తికి ఇదే సాక్ష్యం అంటూ స్థానికులు ఫైర్‌ అవుతున్నారు. మూబు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూల వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది.

వేముల వాడ లో రాజరాజేశ్వర స్వామి భక్తులు.. గుడికి వెళ్లేందుకు, వచ్చేందుకు వేర్వేరు దారులుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ రూ. 28 కోట్లతో ఐదు ఏళ్ల క్రితమే పనులు ప్రారంభించింది. కానీ ఇప్పటి వరకు ఈ పనులు పూర్తి కాలేదు. అంతేకాక.. రెండోసారి బ్రిడ్జి కుప్పకూలడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version