హైదరాబాద్ ఫార్మాసిటీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు : కేటీఆర్

-

ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ ఫార్మాసిటీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించేల చర్యలు తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు.

ఫార్మాసిటీ కోసం స్థానికుల సహకారంతో పనులు వేగంగా ముందుకు వెళ్తున్నాయని అధికారులు మంత్రులకు తెలియజేశారు. స్థానికుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఫార్మాసిటీ కోసం భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఈ దిశగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు ఫార్మాసిటీలో ప్రభావిత కుటుంబాల జాబితా ఒకటి తయారు చేసి వారి ఇళ్లలో ఉన్న కుటుంబ సభ్యుల విద్యార్హతలు, ఇతర టెక్నికల్ అర్హతలను మ్యాపింగ్ చేయాలన్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, ఇతర శిక్షణా సంస్థల సహకారంతో ముందుకు పోవాలన్నారు.స్థానికులకు శిక్షణ ఇచ్చేందుకు ఫార్మా సిటీ పరిసర మండలాల్లో 2 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version