దేవుడి పేరుతో దాడులా ? నా దృష్టిలో మా అమ్మ నా దేవత – కేటీఆర్‌

-

దేవుడి పేరుతో దాడులా ? నా దృష్టిలో మా అమ్మ నా దేవత అని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్‌. నా పేరు మీద కొట్టుకు చావండి అని ఏ దేవుడు చెప్పాడని బీజేపీపై ఫైర్‌ అయ్యారు. మతం పేరుతో… దేవుడి పేరుతో.. కొట్లాటలు చేయమని ఎవరు చెప్పారని నిలదీశారు. ఏం తినాలో.. ఏం వినాలో డిక్టేట్‌ చేస్తున్నారు.. దేశం సిగ్గుపడాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారని ఆగ్రహించారు.. జీడీపీ… గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ పెరిగిపోయింది. సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ సీరియస్‌ అయ్యారు.

నీళ్లు, నిధులు, నియామకాలు… ధ్యేయంగా తెలంగాణ కోసం ఉద్యమించామని.. ఆ దిశగా రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. కానీ… ఈరోజు ఎక్కడెక్కడ నుంచో.. ఎవరెవరో వచ్చి… ఏదేదో మాట్లాడుతున్నారని బీజేపీ పై మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్… కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ లో ఉందన్నారు. అలాంటి ప్రాజెక్ట్ లో ఉన్న చిన్న చిన్న లోపాలను కూడా భూతద్దం పెట్టి వెతికి… అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version