కేసీఆర్, టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి.. మతం పేరుతో పిచ్చోళ్ళు !

-

మల్కాజిగిరి, శేరి లింగం పల్లి, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలిటికల్ టూరిస్టులతో హైదరాబాద్ నగరానికి ఒరిగేది ఏమీ లేదని అన్నారు. కేసీఆర్ సింహం లాగా సింగిల్ గా వస్తున్నాడు, ఢిల్లీ నాయకులు ఎన్నికలు అనగానే డజన్ల కొద్దీ పరిగెత్తుకుని వస్తున్నారని అన్నారు. వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్క నాయకుడు హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడలేదన్న ఆయన ఉద్వేగాలు కాదు – ఉద్యోగాలు ముఖ్యం అని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఆగం చేయాలని చూస్తున్నారని, నగర ప్రజలు ఆలోచించి అభివృద్ధి పట్టం కట్టాలని కోరారు.

కాంగ్రెస్ వాళ్లు ఎటు కాకుండా అయిపోయారు, వారు ఢిల్లీలో లేరు…గల్లీలో లేరని కేటీఆర్ అన్నారు. బిజెపి వాళ్ళను అడుగుతున్న…తెలంగాణ కోసం వారు ఏం చేశారు ?  మోదీ అన్న 15 లక్షలు వచ్చిన వాళ్ళు బీజేపీ పార్టీకి ఓటు వేయండి…రాని వాళ్ళు టిఆర్ఎస్ కి ఓటు వేయండని కేటీఆర్ ఓటర్లను కోరారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర చలానా లు కడుతున్నారా ? ఒక్క హైదరాబాద్ లో చలానాలు కడతారట అంటూ ఎద్దేవా చేశారు. అరేండ్లలో ఏం చేశారు అని బీజేపీ వాళ్ళను నిలదీయండి అని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఒక్క కేసీఆర్, ఒక్క టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి గుంపులు గుంపులుగా వస్తున్నారని ఆయన అన్నారు. మతం పేరుతో వచ్చే పిచ్చోళ్ళు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారని ఆయన ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version