ఈటల రాజేందర్ వ్యవహరంపై మొదటి సారిగా కేటీఆర్ స్పందించారు. ఈటెల రాజేందర్ కు టీఆరెస్ ఎంత ఇచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలని..ఈటెల రాజేందర్ కు టీఆరెస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని మండిపడ్డారు. మంత్రిగా ఉండి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టారని..ఈటెల రాజేందర్ తప్పు చేయకుండానే ఒప్పుకున్నారా? అని ప్రశ్నించారు.
ఈటెల పై సానుభూతి ఎందుకు …ఎట్లా వస్తది!.. బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలి? అని ఫైర్ అయ్యారు. ఈటెల పై అనామకుడు ఉత్తరం రాస్తే సీఎం చర్యలు తీసుకోలేదని.. ఈటెల రాజేందర్ ఆత్మ వంచన చేసుకుంటున్నారని మండిపడ్డారు.
ఐదేళ్ల కిందట నుంచి కేసీఆర్ తో గ్యాప్ ఉంటే ఎందుకు మంత్రిగా కొనసాగారు? ఐదేళ్ల నుంచి ఈటెల రాజేందర్ అడ్డంగా మాట్లాడినా మంత్రిగా కేసీఆర్ ఉంచారని చురకలు అంటించారు. ఈటెల రాజేందర్ చివరి వరకు పార్టీలో ఉండాలన్న ప్రయత్నం నేను వ్యక్తిగతంగా చేసానని తెలిపారు. ఈటెల రాజేందర్ పార్టీలోకి రాకముందు కూడా కమలాపురం బలంగానే ఉన్నాం.. ఇప్పుడు కూడా హుజురాబాద్ లో టిఆర్ఎస్ బలంగానే ఉందని స్పష్టం చేశారు కేటీఆర్.