బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ముందుగా సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరయ్యేందుకు బయలుదేరారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తూప్రాన్ పేట్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఆ సమయంలో రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అక్కడే ఉన్నారు. కేటీఆర్‌కు సాదరంగా స్వాగతించారు. అనంతరం కేటీఆర్ జిల్లాలో పర్యటించి కేడర్‌లో నూతనోత్తేజం నింపనున్నారు.అక్కడకు మాజీమంత్రి జగదీశ్ రెడ్డి కూడా వచ్చారు. కేటీఆర్ వస్తున్నారని తెలియడంతో భారీగా కేడర్ తరలివచ్చింది.