శంషాబాద్‌లోని ఈకేఏఎం కన్వెన్షన్ హాల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో జనాలు దూరంగా పరుగులు తీశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న ఈకేఏఎం కన్వెన్షన్ హాల్‌లో గురువారం ఉదయం సంభవించింది.
మంటల భారీగా ఎగసిపడుతుండటంతో అక్కడకు వెళ్లేందుకు ఎవరూ ప్రయత్నం చేయడం లేదు.దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా అక్కడకు చేరుకుని చుట్టుపక్కల జనాలను దూరంగా తరలిస్తున్నారు.