ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ బహిరంగ లేఖ రాశారు.ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి అని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలి అని కోరారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన నాటి నుంచి 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా?ఉపాధి లేక ప్రజా భవన్ ముందే ఆటోను తగలబెట్టుకున్నా కనికరించరా?ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి అని డిమాండ్ చేశారు.ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి నెలకు రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించాలి అని పేర్కొన్నారు.
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం అయినా నాటి నుంచి బస్సుల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఆటోలో ఎవరు ప్రయాణించడం లేదని ఆటో సంఘం నిరసనలు చేస్తున్నారు.