గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినుల ఆందోళనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.వసతి గృహ వార్డెన్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. వర్శిటీలో విద్యార్ధులు గత రాత్రి భోజనం మానేసి ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అంతకుముందు నిన్న మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేస్తుండగా సాంబార్‌లో కప్ప కనిపించిందని భోజనం వదిలేసి వెళ్లారు.
ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవడం మాసేసి విషయం బయటకి రాకుండా చూశారు. అధికారుల తీరును నిరసిస్తూ వర్సిటీ విద్యార్ధులు రాత్రి సైతం భోజనం మానేసి ఆందోళనకు దిగారు.ఈ విషయం కాస్త నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో యూనివర్సిటీ అధికారులపై ఫైర్ అయ్యారు. విద్యార్థినుల వసతిగృహ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. మెస్ కాంట్రాక్టర్‌గా ఉన్న వార్డెన్‌పై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.