మే 2న ‘కుబేర’ మూవీ టీజర్ రిలీజ్

-

ధనుష్ హీరోగ పాన్ ఇండియ చిత్రంగా రూపొందుతున్న మరో సినిమా కుబేర. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ధనుష్‌ కాంబినేషన్‌లో సంగీతవిద్వాంసుడు ఇళయరాజా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇళయరాజా. ఈ మూవీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించనున్నాడు

‘కుబేర’ సినిమా టీజర్ మే 2న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ రష్మిక కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో, నాగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.ప్రస్తుతం ధనుష్ 50వ సినిమా గా రూపొందించబడుతున్న రాయన్ కోసం సిద్ధమవుతున్నాడు. కాగా ఈ మూవీకి ధనుష్ దర్శకత్వం కూడా వహిస్తున్నాడు.సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news