టీమిండియా వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే t 20 ప్రపంచకప్‌ మొదలవనుందన్న విషయం తెలిసిందే.జూన్‌ 2 నుంచి 29 వరకూ జరిగే మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోనీ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే…టీ20 వరల్డ్కప్లో భారత జట్టు వైస్ కెప్టెన్గా రిషభ్ పంత్ను నియమించే అవకాశాలున్నాయని క్రిక్బజ్ పేర్కొంది.

ఈ లీడర్షిప్ రోల్ కోసం అతను హార్దిక్ పాండ్యతో పోటీలో ఉన్నాడని తెలిపింది. రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో రీఎంట్రీ ఇచ్చి బ్యాటింగ్, కీపింగ్లో రాణిస్తున్నారు. మరోవైపు హార్దిక్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. దీంతో సెలక్టర్లు పంత్ను రోహిత్ శర్మకు డిప్యూటీగా నియమించాలని భావిస్తున్నారట.

కాగా, టీ20 వరల్డ్ కప్‌కు జట్టును వెల్లడించడానికి మే 1వ తేదీనే ఆఖరి గడువు. ఇప్పటికే మెగా టోర్నీలో పాల్గొనే తమ జట్టును ఇవాళ న్యూజిలాండ్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news