టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కూన రవికుమార్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. పంచాయితీ రాజ్ అధికారిపై ఆయన బెదిరింపులకు దిగడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. దీనితో ఆయన తన వర్గీయులతో ఆముదాల వలస పోలీసు స్టేషన్ వద్ద బైటాయించారు. దీనితో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఆయన ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్ చేసారు. ఫోన్ చేసినప్పుడు ఆ ఉద్యోగి ఫోన్ తీయలేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయని, ప్రభుత్వంలో ఎప్పుడూ ఒకే పార్టీ ఉండదు అన్నారు ఆయన. ఇక స్పీకర్ తమ్మినేని సీతారం లక్ష్యంగా విమర్శలు చేసారు. 2024 లో స్పీకర్ తమ్మినేని సీతారం ని గుడ్డలు ఊడదీసి నిలబెడతారు అంటూ కూన ఆరోపణలు చేసారు.