ఇన్నాళ్ళు భారత్ లో అడుగు పెట్టని మహమ్మారి కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ లో అడుగుపెట్టింది. భారత్ లో రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి ఢిల్లీ లో విమానాశ్రయంలో పరిక్షలు చేయగా అతనికి కరోనా వైరస్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అదే విధంగా హైదరాబాద్ లో మరో కరోనా వైరస్ కేసుని గుర్తించారు వైద్యులు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా ఉన్నట్టు తేల్చారు.
దీనితో తెలంగాణా ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ ఇప్పుడు భారత్ కి రావడం ఆందోళన కలిగించే విషయం. దీనిపై తెలంగాణా ఆరోగ్యా శాఖ సమీక్ష నిర్వహిస్తుంది. మంత్రి ఈటెల రాజేంద్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు