ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో గత ప్రభుత్వంలో కొలువుదీరిన కార్పొరేషన్లు, మున్సిపల్స్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అయితే, తమ వారిని బెదరించి, భయాందోళనకు గురిచేసి కార్పొరేషన్లు, మున్సిపల్స్ను టీడీపీ తన వశం చేసుకుంటున్నదని ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఆరోపిస్తున్నది.
తాజాగా కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికకు కేవలం 9 మంది వైసీపీ కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు.మరో ముగ్గురు టీడీపీ గూటికి చేరుకున్నారు. దీంతో టీడీపీ ఖాతాలోకి కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి వచ్చింది. కాసేపట్లో ఎన్నికల అధికారి అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా, కూటమి సర్కారుపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.