అటు కుప్పం..ఇటు పులివెందుల..సక్సెస్ అవ్వడం కష్టమే!

-

ఏపీలో రాజకీయాలు ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్‌కు వెళ్లిపోయాయి. ఎవరికి వారు ప్రజల మద్ధతుపై డప్పు కొట్టేసుకుంటున్నారు. అసలు ప్రజలకు తాము మంచి పనులు చేశామని, ప్రజలు తమనే గెలిపిస్తారని..కుప్పం తో సహ 175కి 175 గెలిచేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోయిందని, వైసీపీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని రాబోయేది టి‌డి‌పి ప్రభుత్వమే అని..ఆఖరికి పులివెందులలో కూడా పసుపు జెండా ఎగరవేస్తామని టి‌డి‌పి నేతలు అంటున్నారు.

ఇలా అటు వైసీపీ, ఇటు టి‌డి‌పి గెలుపుపై బాగా ధీమాగా ఉన్నారు. పైగా చంద్రబాబు కంచుకోట కుప్పంని గెలుస్తామని వైసీపీ…ఇటు జగన్ కంచుకోట పులివెందులని గెలుస్తామని టి‌డి‌పి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఆ రెండు సీట్లు గెలవడం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ కిందకు వస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పం టార్గెట్ గా ఎలాంటి రాజకీయం చేశారో చెప్పాల్సిన పని లేదు. అక్కడ అన్నీ ఎన్నికలని గెలిచేశారు. కాకపోతే ఎలా గెలిచారనేది కూడా చూడాలి. అధికార బలంతోనే ఆ విజయాలు దక్కాయని చెప్పవచ్చు.

అలా అని సాధారణ ఎన్నికల్లో కుప్పం ప్రజలు చంద్రబాబుని కాకుండా వైసీపీని గెలిపిస్తారని అనుకోవడం అవివేకం..కుప్పంలో ప్రజలు ఇప్పటికీ బాబు వైపే ఉన్నారు..మెజారిటీ ఆయన సైడ్ కనిపిస్తుంది. ఇక పులివెందుల అంటారా చెప్పాల్సిన పని లేదు. పులివెందుల జగన్ ని ఓడించడం టి‌డి‌పికి సాధ్యమయ్యే పని కాదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల లో టి‌డి‌పికి కాస్త లీడ్ వచ్చినంత మాత్రాన..పులివెందుల గెలుస్తామనేది టి‌డి‌పి భ్రమ.

కాకపోతే రాజకీయంగా రెండు పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయనే చెప్పాలి. అటు కుప్పం గెలుస్తామని చెప్పి టి‌డి‌పి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని వైసీపీ చూస్తుంది..ఇటు పులివెందులని టార్గెట్ చేసి టి‌డి‌పి అదే చేస్తుంది. కానీ ఇవేమీ జరిగే పనులు కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version