ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ప్రతి రొజు ఎక్కడో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. రోడ్డు భద్రతా వారోత్సవాల పేరిట ఊదరగొట్టే ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు కూడా వెనకాడుతూ ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్ద బోధనం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ఇద్దరికి సీరియస్ గా ఉందని అంటున్నారు. ఇక అందరినీ ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడప నుంచి కర్నూలు వస్తుండగా టైర్ పేలి ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంచి స్పీడ్ లో ఉండగా టైరు పేలడంతో బస్సు పల్టీలు కొట్టినట్టు గుర్తించారు.