వర్షా కాలంలో తక్కువ వర్షపాతం నమోదు అవ్వడంతో వేసవి ప్రారంభం కాకముందే కర్ణాటకలో నీటి కష్టాలు మొదలైపోయాయి. చెరువులు కుంటలు పూర్తిగా ఎండిపోవడం వలన పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బంది మొదలైంది.కొనుక్కుని తాగడానికి కూడా నీళ్లు లభించట్లేదు సరిగా, ముఖ్యంగా బెంగళూరులో అయితే మంచినీటి సమస్య ఎక్కువగా ఉంది .చెరువులు పూర్తిగా ఎండిపోయాయి దీంతో దాదాపు 7వేలకి పైగా భూగర్భ బోరు బావులు అడుగంటిపోయినట్లు తెలుస్తోంది .
ఈ పరిస్థితుల్లో అక్కడి కొన్ని పాఠశాలలు మూసివేసేందుకు దారి తీస్తున్నాయి. పాఠశాలల్లో అవసరమైనంత నీటిని అందించ లేకపోతున్నారు. ఎండలు కూడా పెరగడంతో పిల్లలకు రక్షణ ఇవ్వలేమని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇదే అదునుగా వాటర్ ట్యాంకర్ యజమానులు రేట్లు పెంచగా.. రంగంలోకి దిగిన కర్ణాటక ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది.