పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన, తీసుకోకూడని ఆహార పదార్థాలు..

-

పిల్లలకి తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి. పుట్టిన బిడ్డకు అమ్మపాలే ఆహారం. వాటితోటే మాంసచర్మాదులు వయసు పెంచుకుంటాయి. బిడ్డ పుట్టిన ఆరునెలల వరకైనా తల్లిపాలు ఖచ్చితంగా అవసరం. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగువతుంది. ఇన్ని లాభాలున్నా తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి చాలా మేలైనవి. ఐతే బిడ్డలకి పాలివ్వాలంతే తల్లులు సరైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. పాలిచ్చే తల్లులు ఏ ఆహారాలు తీసుకోవాలి? ఏ ఆహారాలు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

కేలరీలు

పాలిచ్చే తల్లులు ఎక్కువ శక్తి అవసరం. రోజులో 300-350 Kcal అవసరం ఉంటుంది. అందుకే తృణధాన్యాలని ఆహారంగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, గింజలు మొదలైనవి అధిక కేలరీలని అందిస్తాయి. అలాగే చక్కెర శాతం ఎక్కువగా ఉండే జ్యూస్, కూల్ డ్రింక్స్ ముట్టుకోవద్దు.

ప్రోటీన్

గుడ్లు, పాలు పాల పదార్థాలు, చికెన్, మాంసం, చిక్కుళ్ళు, పాదరసం తక్కువగా ఉండే సముద్ర ఆహారాలు, క్వినోవా వంటి ఆహారాలు కూడా మంచి ప్రోటీన్ ని అందిస్తాయి.

కొవ్వులు, నూనెలు

ఆహారానికి అదనపు రుచిని అందించే నూనెలు కూడా పాలిచ్చే తల్లుల శరీరానికి చాలా మేలు చేస్తాయి. దీనివల్ల పిల్లల్లో మెదడు, నాడీ సంబంధ వ్యవస్థలు అభివృద్ది చెందుతాయి.

విటమిన్లు, ఖనిజాలు

పాలిచ్చే తల్లుల్లో విటమిన్ల శాతం తక్కువగా ఉన్నట్లయితే బిడ్డ ఎదుగులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా బీ12విటమిన్ చాలా ముఖ్యమైనది. ఎర్ర రక్తకణాల అభివృద్ధిలో ఇది సాయపడుతుంది. మాంసాహారాల్లో విటమిన్ బీ12పుష్కలంగా ఉంటుంది.

పాలిచ్చే తల్లులు తీసుకోకూడని ఆహారాలు

అల్కహాల్, పాదరసం, కెఫైన్ ఉన్న ఆహారాలను ముట్టుకోవద్దు. ఆల్కహాల్ కారణంగా పిల్లల్లో శక్తి ఉత్పత్తి అవదు. దానివల్ల పిల్లలు నీరసంగా ఉంటారు. 1లేదా రెండు కప్పుల కాఫీ కంటే ఎక్కువ తాగకూడదు. పిల్లలు సరిగ్గా నిద్రపోవాలంటే కాఫీ తాగే అలవాటును అదుపులో ఉంచుకోవాలి. సముద్ర ఆహారాల్లో పాదరసం ఉంటుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం ప్రమాదాలకి దారి తీయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండడంమంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version