పాపం బైక్ పంక్చర్ అని చెప్పి ఎలా దొరికిపోయిందో చుడండి…!

-

సాధారణంగా ఆఫీస్ కి డుమ్మా కొట్టాలి అంటే మనం ఎం చెప్తాం…? కడుపు నొప్పి అనో, జ్వరమనో, చనిపోయిన వాళ్ళను మళ్ళీ చంపడమో ఏదొకటి చేస్తూ ఉంటాం. కాని ఒక అమ్మాయి మాత్రం తన టైర్ కి పంక్చర్ పొడుచుకుంది. అది ఏముంది అంటారా…? అక్కడే ఉంది మరి. ఒకసారి ఈ స్టొరీ చదివితే మేటర్ ఏంటో అర్ధమవుతుంది. ఆఫీస్ కి డుమ్మా కొట్టడానికి గాను ఒక అమ్మాయి,

తన బైక్ టైర్ కి పంక్చర్ అయిందని చెప్పడమే కాకుండా ప్రూఫ్ కోసం టైర్ కు మేకు గుచ్చుకున్న ఫోటోని పంపించింది. అక్కడే అమ్మాయి గారు దొరికిపోయారు. ఆమె పంపిన ఫోటోని చూసిన కొలీగ్, అది ఫేక్ ఫోటో అని, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన ఫోటో అని గుర్తించి వెంటనే తన ట్విట్టర్ లో షేర్ చేసింది. నా సహోద్యోగి ఫోన్ చేసి తన బైక్ టైర్ కు పంక్చర్ అయిందని చెప్పి ఫోటో పంపిందని, ఒకసారి అందరూ ఈ ఫోటో జూమ్ చేసి చూడండి

మీకే అర్ధమవుతుందని ట్వీట్ చేసింది. ఆమె చేసిన ట్వీట్ క్షణాల్లోనే 2.4 లక్షల లైకులు, 44,000 రీట్వీట్లు సంపాదించింది. ఆమెను ఆఫీస్ యాజమాన్యం కూడా ఏమీ అనలేదట. సాకు చెప్తే కాస్త అర్ధవంతంగా ఉండేది చెప్పాలని, ఇలా దొరికిపోతే ఎలా అంటూ ఆఫీస్ కొలీగ్స్ ఆమెను ఎద్దేవా చేసారట. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది మాత్రం స్పష్టత రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news