నేను ఇంకా 10 ఏళ్లే బతుకుతా, చంద్రబాబు వ్యాఖ్యలు…!

-

అమరావతి జెఎసి వేధిస్తే తాను చూస్తూ ఊరుకోను అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అమరావతి పరిరక్షణ ర్యాలీని గుంటూరు జిల్లా నరసరావు పేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక రాజధానికి దిక్కు లేదు ఈ సిఎం మూడు రాజధానులు కడతాడ౦ట అని చంద్రబాబు ఎద్దేవా చేసారు. ఆంధ్రప్రదేశ్ కి ఇంత చెడు చేసిన సిఎం ఇంకెవరు లేరని చంద్రబాబు మండిపడ్డారు.

మంత్రులు కోడిపందాలు, టిక్ టాక్ లు, ఎడ్ల పందాల్లో బిజీ గా ఉంటే ముఖ్యమంత్రి వీడియో గేమ్స్ లో బిజీ గా ఉన్నారని ఎద్దేవా చేసారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని తన నినాదం అన్న చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాను కాబట్టి ఇంకో 10 లేదా 15 ఏళ్ళు బ్రతుకుతా అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేసారు. వైసీపీ నేతలు కులాలు, మతాల,ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు.

పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే, ఆ గ్రామం అంతా పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాలు చేయాలన్నారు. పోలీసులు పెడుతున్న కేసులకు ఎవరు భయపడవద్దని సూచించారు. ఈసారి సంక్రాంతి అమరావతి సంక్రాంతిగా జరగాలన్న ఆయన, ప్రతి ఒక్కరు భోగి పండగ రోజు జియన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేయాలని పిలుపునిచ్చారు. మన రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందన్నారు. రేపటి నుండి ప్రతి ఒక్కరి ఫోన్లో రింగ్ టోన్ జై అమరావతి అని వినపడాలన్నారు. ఎవరికి అయినా ఫోన్ చేసినా గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా జై అమరావతి అని చెప్పాలని చంద్రబాబు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news