వైసీపీలో ఆ లేడీ ఎమ్మెల్యేలతో డౌటే…?

-

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి కరెక్ట్‌గా రెండున్నర ఏళ్ళు అయింది..ఈ రెండున్నర ఏళ్లలో వైసీపీ బలం తగ్గిందా? పెరిగిందా? అంటే సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీపై కాస్త వ్యతిరేకత రావడం సహజమే..పైగా ఒకేసారి భారీ విజయాన్ని దక్కించుకున్న వైసీపీపై కాస్త ఎక్కువగానే వచ్చినట్లే కనిపిస్తోంది. అలా అని ఎక్కువగా లీడ్ పడిపోలేదు. ఇప్పటికీ టీడీపీ కంటే వైసీపీనే ముందు ఉంది. కాకపోతే గత ఎన్నికల సమయంతో పోలిస్తే ఇప్పుడు కాస్త వైసీపీ బలం తగ్గినట్లే కనిపిస్తోంది.

అలాగే వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే…ఇందులో 50 మంది వరకు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలో ఉన్న లేడీ ఎమ్మెల్యేలు మెజారిటీ స్థాయిలో ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అలా వ్యతిరేకత ఎదురుకుంటున్నవారిలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఉన్నారు. తొలిసారి గెలిచిన ఆమెపై వ్యతిరేకత గట్టిగానే వచ్చిందని తెలుస్తోంది. ఇటీవల నియోజకవర్గంలో జరిగిన హీరా జెడ్పీటీసీ ఎన్నికలో ఎమ్మెల్యే కుమారుడు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంటే పాతపట్నంలో పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అటు పాలకొండ ఎమ్మెల్యే కళావతికి కూడా అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. వరుసగా రెండుసార్లు గెలిచిన ఈమెపై కూడా వ్యతిరేకత కనిపిస్తోంది. అదేవిధంగా పాడేరులో భాగ్యలక్ష్మీ, రంపచోడవరంలో ధనలక్ష్మీలకు కూడా పాజిటివ్ తక్కువే. ఇక కళ్యాణదుర్గంలో ఉషశ్రీ చరణ్, తాడికొండలో శ్రీదేవిలకు నెగిటివ్ ఎక్కువ కనిపిస్తోంది.

మహిళా మంత్రులైన పుష్పశ్రీ వాణి, తానేటి వనిత, మేకతోటి సుచరితలు సైతం వ్యతిరేకతని ఎదురుకుంటున్న వారిలో ఉన్నారు. అటు నగరిలో రోజాకు సొంత పార్టీతో తలనొప్పులు కనిపిస్తున్నాయి. చిలకలూరిపేటలో రజినికి సైతం సొంత పోరు ఎక్కువగా ఉంది. శింగనమలలో జొన్నలగడ్డ పద్మావతికి సొంత బంధువుల వల్ల మంచి పేరు పోయేలా ఉంది. అయితే వీరిలో కొందరు మళ్ళీ జగన్ గాలిలో నెట్టుకురావచ్చు…అలాగే కొన్ని వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ కాస్త ప్లస్ ఉండొచ్చు. కానీ కొందరైతే మళ్ళీ గెలవడం డౌటే అని చెప్పొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version