అక్కడ మహిళల ఆధ్వ్యరంలో కోడి పందాలు !

-

ఏపీలో సంక్రాంతి సంబరాలు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది కోడి పందేలు. ప్రభుత్వాలు, కోర్టులు, పోలీసులు ఎంత మొత్తుకున్నా పందెం రాయుళ్లు మాత్రం కోడి పందేలు నిర్వహించకుండా ఆగరు. ఇది ఇప్పుడు జరిగేది కాదు, స్వాతంత్రం ముందు నుండే ఈ కోడి పందాలు నిర్వహించకూడదని ఎన్ని చట్టాలు చేసినా ఉన్నా పందెం రాయుళ్లను మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో కొన్నిచోట్ల మహిళలే కోడి పందేలు నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పశ్చిమగోదావరి జిల్లాలో మహిళల కోడిపందాలు జోరుగా సాగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మందలపర్రులో మహిళల కోడిపందాలు నిర్వహించారు. అదేంటి అని ప్రశ్నిస్తే కోడిపందేల ఆడటం సాంప్రదాయాన్ని వారు చెబుతున్నారు. ఇక జిల్లాలో రాత్రి 12 గంటల వరకు కోడి పందాలు సాగాయి. రెండు రోజుల్లో కలిపి సుమారు 90 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. ఇక గుండాట, పేకాట, కోత ముక్కలాట ఇలా వీటన్నిటికీ కలిపి మరో 40 కోట్ల బెట్టింగ్ జరిగిందని అంచనా. ఇక ఈ ఏడాది పందాలలో మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version