విజయ్ దేవరకొండ కొత్త సినిమా టీజర్ రిలీజ్

-

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న VD12 సినిమా టైటిట్, టీజర్ రిలీజయ్యాయి. ఈ కిత్రానికి కింగ్డమ్ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. టీజర్ లో విజయ్ లుక్స్ డైలాగ్స్, మ్యూజిక్ తో పాటు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం మే 30న విడుదల కానుంది.

టీజర్ ని పరిశీలించనట్టయితే.. అలసట లేని భీకర యుద్ధం..  అలలుగా పారే ఏరుల రక్తం.. వలస పోయినా అలిసి పోయినా ఆగిపోనిది ఈ మహారణం.. నేలపైన దండయాత్రలు, మట్టినిండా మృతదేహాలు, ఈ అలజడి ఎవరి కోసం అంటూ  ఎన్టీఆర్ వాయిస్ ఆకట్టుకుంది.రణ భూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం అంటూ ఎన్టీఆర్ డైలాగ్ ప్రత్యేకం అనే చెప్పాలి. అదే సమయంలో హీరో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇస్తాడు. ఈ సినిమా తో విజయ్ దేవరకొండ మంచి హిట్ కొడతాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరీ. 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version