లక్ష్మీబాంబ్ టైటిల్ మార్పు.. కొత్త టైటిల్ ఏంటంటే..!

టాలీవుడ్ లో హర్రర్ కామెడీ సినిమా గా వచ్చి ఘన విజయాన్ని అందుకున్న కాంచన సినిమాను ఇటీవలే దర్శకుడు రాఘవ లారెన్స్ హిందీలో కూడా రీమేక్ చేసిన విషయం తెలిసింది. ఈ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి లక్ష్మీ బాంబ్ అనే పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు దర్శకుడు రాఘవ లారెన్స్. సినిమాలో ప్రధాన పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెలుసు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ను ఎంతగానో ప్రేక్షకాదరణ పొందింది.

ఇక ఈ సినిమా వచ్చే నెల 9వ తేదీన ఓటిటి వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది అయితే విడుదలకు ముందే ఈ సినిమా టైటిల్ విషయంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీబాంబ్ అని ఉన్న టైటిల్ని కేవలం లక్ష్మీ గా మార్చాలని చిత్రబృందం భావిస్తోందట. సినిమా టైటిల్ నుంచి బాంబ్ అనే పదాన్ని తీసేయాలని చిత్ర బృందం భావిస్తున్నారట.