పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ నే వెన్నుపోటి పొడిచాడు.. ఆయనను గద్దెదింపి తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకొన్నాడు.. ఆయన గుండెపోటుతో మరణించడానికి పరోక్ష కారణమయ్యాడు.. అంటూ సీనియర్ ఎన్టీఆర్ టాపిక్ వచ్చిన ప్రతీసారి ఫైరవుతూ ఉంటారు ఆయన సతీమణి లక్ష్మీపార్వతి! అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమెకు కొత్త ధైర్యం వచ్చిందంట.. ఫలితంగా బాబును వదిలేది లేదు అని అంటున్నారు లక్ష్మీ పార్వతి!
అవును… నేతలపై కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. చంద్రబాబుపై తాను పెట్టిన పాత కేసును తవ్వి తీస్తున్నారని చెబుతున్నారు లక్ష్మీపార్వతి! తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఆమె… “చంద్రబాబును జైలుకు పంపించేంత వరకు వదలను.. ఆయనపై పెట్టిన అక్రమాస్తుల కేసును విత్ డ్రా చేసుకునే ఉద్దేశం తనకు లేదు.. తాను కేసును విత్ డ్రా చేసుకోవాలంటూ చంద్రబాబు తనపై ఒత్తిడి తెస్తున్నారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు!
కాగా… హైదరాబాద్ ఏసీబీ కోర్టులో శుక్రవారం నాడు చంద్రబాబు ఆస్తులకు సంబంధించి విచారణ జరిగింది. దీనికి పిటీషన్ దారుగా లక్ష్మీపార్వతి హాజరయ్యారు. ఈ సందర్భంగా… 1978 నుంచి 2005 వరకు చంద్రబాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టుకు సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఏసీబీ కోర్టు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.