టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీపై ఆరోపణలు చేసాడు ప్రవీణ్. ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో తన ని ప్రవీణ్ భయ పెట్టాడని, ఒకవేళ తాను చెప్పినట్లు చేయకపోతే కెరీర్ ని కూడా నాశనం చేస్తాను అని నాతో చెప్పాడు అని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల క్రికెట్ కి కూడా దూరంగా ఉంటున్నాడు ప్రవీణ్ కుమార్. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడుతూ టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ లలిత్ మోడీపై ఆరోపణలు చేసాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం లో ఆడాలని అనుకోలేదు. నా స్వస్థలం మీరఠ్‌కు బెంగళూరు దూరం. ఇంగ్లీష్ కూడా సరిగా వచ్చేది కాదు. ఫుడ్ కూడా నచ్చేది కాదు. దీంతో ఢిల్లీ ఫ్రాంఛైజీకి ఆడాలని అనుకున్నా అని చెప్పాడు.