ఇకనైనా పెళ్లి చేసుకోవయ్యా… రాహుల్ కు లాలూ సలహా

-

పాట్నా: ‘పెళ్లి చేసుకో.. ఇంకా ఆలస్యం చేయవద్దు’ అని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి సలహా ఇచ్చారు. బీహార్‌ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో రాహుల్‌ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ‘పెళ్లి చేసుకో.. మేమంతా ఆ వేడుకలో పాల్గొంటాం’ అని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు. 53 ఏళ్ల రాహుల్‌ గాంధీ నవ్వుతూ దీనికి బదులిచ్చారు. ‘ఇప్పుడు మీరు దాని (పెళ్లి) గురించి చెప్పారు. ఇక అది జరుగుతుంది’ అని అన్నారు.

పెళ్లి వద్దంటూ అమ్మకు ఇంకా చిరాకు తెప్పించకు అని లాలూ హితవు పలికారు. మా మాట విను… పెళ్లి చేసుకో… నీ పెళ్లి ఊరేగింపులో మేం పాల్గొనాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు. లాలూ తన పెళ్లి గురించి మాట్లాడడంతో రాహుల్ కాస్త సిగ్గుపడ్డారు. చిరునవ్వుతోనే లాలూ మాటలను స్వీకరించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వయసు 53 సంవత్సరాలు. ఆయన ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నారు. అయితే రాహుల్ కు విదేశాల్లో గాళ్ ఫ్రెండ్ ఉందంటూ పలు కథనాలు వచ్చినా, ఆయనెప్పుడూ ఈ విషయంలో స్పందించలేదు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version