అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారు : మంత్రి సత్యవతి

-

సీఎం కేసీఆర్‌ మానవీయ కోణంలో కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ కారుణ్య నియామకాల ఉత్తర్వులను ఇవాళ (శుక్రవారం) మంత్రి సత్యవతి రాథోడ్ మాసబ్ ట్యాంక్ డిఎస్ఎస్ భవన్ లోని శంకరన్ సమావేశ మందిరంలో 30 మందికి అందజేశారు. ఆ కార్యక్రమం తర్వాత మాట్లాడిన మంత్రి..జిసిసి ని నమ్ముకుని వీధుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. ఉద్యోగుల కుటుంబీకులకు అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని.. కారుణ్య నియామకాల ఉత్తర్వులను అందజేశాం.గిరిజన సహకార సంస్థను నమ్ముకుని అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో జిసిసి ఆధ్వర్యంలో శానిటైజర్ ఉత్పత్తి చేసి, అధిక సంఖ్యలో పంపిణీ చేసాం. అటవీ ఉత్పత్తులకు మరింత బ్రాండ్ ను పెంపొందిస్తూ, సంస్థ అభివృద్ధికి బాధ్యతగా వ్యవహరించాలి.సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఉద్యోగులందరిని అభినందించారు మంత్రి సత్యవతి రాథోడ్.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. జీసీసీ ఉద్యోగులు సంస్థ పురోభివృద్ధికి తోడ్పాటును అందిచాలని సూచించారు. ఇప్పటికే జీసీసీ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుందని, జీసీసీ బ్రాండ్‌ ఇమేజ్‌ను మరింత పెంచాలని ఆమె దిశానిర్దేశం చేశారు. జీసీసీని నమ్ముకుని విధుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ అండగా ఉన్నారని, అందులో భాగంగానే మానవీయ కోణంలో ఆ కుటుంబాల నుంచి అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. కరోనా విపత్క‌ర పరిస్థితుల్లోనూ జీసీసీ శానిటైజర్‌ ఉత్పత్తి చేయటం వల్ల జీసీసీ కేవలం అటవీ ఉత్పత్తులనే కాకుండా సమాజ అవసరాలను తీర్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version